1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. ప్రార్థన
  4. navagraha pradakshnalu mahima's

గ్రహదోషాలు తొలగిపోవడానికి నవగ్రహాలను పూజిస్తే...

నవగ్రహాలు భూమిపై నివసించే మానవాళి మనుగడపై ప్రభావం చూపుతుంటాయి. ఆయా గ్రహాల అనుగ్రహం లేకపోతే సమస్యలు, ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. గ్రహ సంబంధమైన దోషాల కారణంగా ఆర్ధిక పరమైన, ఆరోగ్యపరమైన సమస్యలు సతమతం

navagraha
నవగ్రహాలు భూమిపై నివసించే మానవాళి మనుగడపై ప్రభావం చూపుతుంటాయి. ఆయా గ్రహాల అనుగ్రహం లేకపోతే సమస్యలు, ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. గ్రహ సంబంధమైన దోషాల కారణంగా ఆర్ధిక పరమైన, ఆరోగ్యపరమైన సమస్యలు సతమతం చేస్తుంటాయి. అంతేకాకుండా వివాహంలో ఆలస్యం, సంతానం లేమి వంటి సమస్యలు బాధిస్తుంటాయి. తలపెట్టిన కార్యక్రమాలు మధ్యలోనే నిలిచిపోతుంటాయి.
 
అందువలన చాలామంది నవగ్రహాలకు ప్రదక్షణలు చేస్తుంటారు. అలానే అభిషేకాలు జరుపుతుంటారు. గ్రహ శాంతులు చేయిస్తుంటారు. ఇలాంటి గ్రహదోషాల నుండి విముక్తి కలిగించే మార్గాలలో ఒకటిగా నవగ్రహ చాలీసా అని ఆధ్యాత్మిక గ్రంధాల్లో చెప్పబడుతోంది. అనునిత్యం నవగ్రహాల చుట్టూ తొమ్మిది దీపాలు వెలిగించి నవగ్రహాలకు నమస్కరిస్తూ నవగ్రహ చాలీనా ను పఠించవలసి ఉంటుంది. 
 
ఇలా చేయడం వలన గ్రహదోషాలు సంబంధమైన దోషాలు తొలగిపోయి ఆశించిన ఫలితాలు కనిపిస్తాయని శాస్త్రంలో చెప్పబడుతోంది. నవగ్రహాలకు ప్రదక్షణలు, పూజలు, దీపారాధనలు చేయడం వలన మీరు తలపెట్టిన కార్యక్రమాలు నిలిచిపోకుండా సంతోషంగా జరిగిపోతాయి. జీవితంలో ఎటువంటి ఆటంకాలను ఎదుర్కోవలసి ఉండదు.  
About Writer
Kowsalya
దేవీ (మురళీకృష్ణ)  నిక్‌నేమ్- శక్తిమాన్ సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక...... మరింత చదవండి
తర్వాతి కథనం
శనివారం నాడు ఉపవాస ప్రార్థన చేస్తే... శనీశ్వరుని అనుగ్రహం...