1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. హిందూ
  4. sravana masam lakshmi devi mahima's

శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని ఇలా పూజిస్తే....

శ్రావణమాసాన్ని వరాలు అందించే మాసంగా భక్తులు భావిస్తుంటారు. సౌభాగ్యాన్ని ప్రసాదించే పార్వతీదేవి, సంపదలను ప్రసాదించే లక్ష్మీదేవి భక్తులను అనుగ్రహించడం ఈ శ్రావమమాసం ప్రత్యేకంగా కనిపిస్తుంది. శ్రావణం మంగళ

sravana
శ్రావణమాసాన్ని వరాలు అందించే మాసంగా భక్తులు భావిస్తుంటారు. సౌభాగ్యాన్ని ప్రసాదించే పార్వతీదేవి, సంపదలను ప్రసాదించే లక్ష్మీదేవి భక్తులను అనుగ్రహించడం ఈ శ్రావమమాసం ప్రత్యేకంగా కనిపిస్తుంది. శ్రావణం మంగళవారాల్లో పార్వతీదేవిని, శుక్రవారాల్లో లక్ష్మీదేవిని ఆరాధిస్తూ పూజలు, వ్రతాలు చేస్తుంటారు. పూజ మందిరాల్లో పార్వతి, లక్ష్మీదేవికి భక్తి శ్రద్ధలతో ధూప దీప నైవేద్యాలను సమర్పిస్తుంటారు.
 
శుక్రవారం లక్ష్మీదేవి ఆలయానికి వెళ్లే మహిళా భక్తులు ఆ తల్లికి పండ్లతో పాటు తామర పువ్వులు లేదా గులాబీ పువ్వులను తీసుకుని వెళుతుంటారు. పరమాన్నం పార్వతిదేవికి ఇష్టమైనదిగా శాస్త్రంలో చెప్పబడుతోంది. కాబట్టి బెల్లం, ఆవుపాలు, కొసలు విరగని బియ్యంతో పరమాన్నం తయారుచేసుకుని అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి. 
 
పరమపవిత్రమైన ఈ రోజున అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పిస్తే విశేషమైన ఫలితాలను పొందవచ్చును. శ్రావణం మాసపు శుక్రవారాల్లో ఒక్కపూట మాత్రమే భోజనం చేసి, పగలు నిద్రపోకుండా, ఆ రోజంతా లక్షీదేవిని ధ్యానిస్తు కనకధారాస్తవం, లక్ష్మీదేవ అష్టోత్తరం, లక్ష్మీదేవి సహస్రనామాలు చదువుకోవడం వలన ఆ తల్లి సకల సంపదలను, సంతోషాన్ని ప్రసాదిస్తుందని చెప్పబడుతోంది.
About Writer
Kowsalya
దేవీ (మురళీకృష్ణ)  నిక్‌నేమ్- శక్తిమాన్ సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక...... మరింత చదవండి
తర్వాతి కథనం
చంద్రగ్రహ దోషాలు తొలగిపోవడానికి ఇలా చేస్తే....