గురువారం, 28 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. హిందూ
Written By Kowsalya
Last Updated : సోమవారం, 23 జులై 2018 (15:18 IST)

గోవుల శకునం మంచిదేనా?

ఏదైనా ముఖ్యమైన పనిపై బయటకు వెళుతున్నప్పుడు మంచి శకునం చూసుకుని బయలుదేరడమనేది ప్రాచీన కాలం నుండి పాటిస్తున్నారు. ఎదురొచ్చే శకునం మంచిదైతేనే తలపెట్టిన పనులు విజయవంతంగా పూర్తిచేస్తారని అలాకాకుంటే అవాంతరా

ఏదైనా ముఖ్యమైన పనిపై బయటకు వెళుతున్నప్పుడు మంచి శకునం చూసుకుని బయలుదేరడమనేది ప్రాచీన కాలం నుండి పాటిస్తున్నారు. ఎదురొచ్చే శకునం మంచిదైతేనే తలపెట్టిన పనులు విజయవంతంగా పూర్తిచేస్తారని అలాకాకుంటే అవాంతరాలు ఎదురవుతాయిని చాలా మంది భావిస్తుంటారు. అందుకే వెళ్లేముందు మంచిశకునం కోసం ఎదురుచూస్తుంటారు.
 
మీరు వెళ్ళె సమయంలో ఆవులు ఎదురుగా వస్తూ కనిపిస్తే చాలామంది ఆలోచనపడుతుంటారు. ఆవు సాధుజీవి సకలదేవతా స్వరూపంగా పూజలు అందుకుంటూ ఉంటుంది. కాబట్టి ఇది ఎదురుగా వస్తే మంచి శకునమేనని శాస్త్రంలో చెప్పబడుతోంది. ఆవు శ్రీమహావిష్ణువుకి అత్యంతం ప్రీతికరమైనదిగా చెప్పబడుతోంది. 
 
శ్రీనివాసుడు లక్ష్మీదేవి వెతుకుతూ భూలోకానికి వచ్చినప్పుడు పుట్టలోని స్వామికి ఆవు పాలిస్తుండగా ఆ పశువుల కాపరి దానిని కొడతాడు. ఆ సమయంలో శ్రీనివాసుడికి కూడా దెబ్బ తగులుతుంది. శ్రీనివాసుడు తనకైన గాయానికన్నా ఆవుకు తగిలిన గాయాన్ని గురించే ఎక్కువగా బాధపడుతుంటాడు.
 
శ్రీనివాసుడు ఆగ్రహోదగ్రుడై ఆ పశువుల కాపరిని శపిస్తాడు. భగవంతుడి దృష్టిలో గోవుకు గల స్థానం ఎంతటి ఉన్నతమైనదో ఇక్కడే అర్థంచేసుకోవచ్చును. అంతటి విశిష్టతత కలిగిన గోవులు ఎదురుపడితే ఎలాంటి అపకారం జరుగదని చెప్పబడుతోంది. ఆవుల శకునం శుభప్రదమైనవి కాబట్టి అవి ఎదురు వచ్చే శుభం జరుగుతుందని శాస్త్రం స్పష్టం చేయబడుతోంది.