ఆదివారం, 24 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 3 జనవరి 2023 (15:16 IST)

బుధవారం పూట విఘ్నేశ్వరునికి గరికతో..

Vinayaka
బుధవారం పూట విఘ్నేశ్వరునికి గరికతో పూజిస్తే జన్మ జన్మల దోషాలు తొలగిపోయి సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి.  గణపతికి చెరకు, పంచదార, పప్పు, నెయ్యి, నువ్వులు, అటుకులు, ఉండ్రాళ్లు, తేనె, పప్పు, కరక్కాయ, యాలకులు, కొబ్బరి, మొదలైన వాటితో వినాయకుడిని పూజించాలి. 
 
బుధవారం రోజు వినాయకుడి ఆలయానికి వెళ్లి ఆయన్ను దర్శించుకోవాలి. అలాగే 11 లేదా 21 దర్భలతో గణేశుడికి పూజ చేయాలి. దీంతో పనిలో ఉండే ఆటంకాలు తొలగిపోతాయి. 
 
వినాయకుడికి ఆలయంలో బెల్లంను నైవేద్యంగా పెట్టాలి. అనంతరం దాన్ని భక్తులకు పంచి పెట్టాలి. ఇలా 7 బుధవారాలు చేయాలి. దీని వల్ల అనుకున్న కోరిక నెరవేరుతుంది.