బుధవారం, 22 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : బుధవారం, 21 డిశెంబరు 2022 (20:44 IST)

ప్రభుత్వ ఉద్యోగం కావాలంటే.. ఆదివారం ఇలా చేస్తే?

Puja
ఈ పరిహారాన్ని ఆదివారాల్లో చేయాలి. పూర్తి విశ్వాసంతో చేస్తే తప్పకుండా ఫలితం ఉంటుంది. ప్రతిరోజూ సూర్య నమస్కారం చేయాలి. అలాగే ప్రతి ఆదివారం ఉదయం 6 గంటల నుండి 7 గంటల మధ్య ఇంటి డాబా మీద సూర్య హోరలో నేతితో దీపం వెలిగించి సూర్యుడిని పూజించాలి. డాబా లేని వారు సూర్య కిరణాలు పడే చోట దీపం వెలిగించి.. పూజ చేయడం మంచి ఫలితాలను ఇస్తుంది. 
 
దీపం వెలిగించేటప్పుడు సూర్యునికి నైవేద్యంగా గోధుమలతో చేసిన వంటకాలను, కలకండను సమర్పించవచ్చు. ఆదిత్యుడిని పూజించడం సూర్య గాయత్రి లేదా సూర్య శ్లోకం లేదా ఆదిత్య హృదయం స్తోత్రం చెప్పవచ్చు. ఇలా 108 రోజులు ప్రార్థిస్తే ప్రభుత్వ ఉద్యోగం ఖాయమని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.