గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 13 డిశెంబరు 2022 (13:54 IST)

నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన తెలంగాణ సర్కారు

tscmkcr
నిరుద్యోగులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. తెలంగాణ కోర్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల్లో 4,600  పోస్టులను భర్తీ చేసేందుకు ఆ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ మేరకు రాష్ట్రంలోని వివిధ న్యాయస్థానాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది.
 
దీంతో కోర్టుల్లో సిబ్బంది నియామకాల కోసం గతంలో ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులకు తాజాగా ఆమోదం లభించినట్టయింది. ఈ నియామకాలకు సంబంధించి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ త్వరలోనే జారీ చేయనుంది. 
 
ఇప్పటికే తెలంగాణ పోలీసు, బీసీ సంక్షేమ శాఖ, రోడ్డు భవనాల శాఖల్లో కలిపి మొత్తం 7,029 పోస్టుల భర్తీ కోసం రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన విషయం తెల్సిందే. తాజాగా మరో 4,200 పోస్టులకు అనుమతి లభించడంతో రానున్న రోజుల్లో మొత్తం 11 వేల ఉద్యోగాల నియామక ప్రక్రియ ప్రారంభంకానుంది.