శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 30 అక్టోబరు 2022 (14:36 IST)

సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం ... తెలంగాణాలోకి సీబీఐ నో ఎంట్రీ!

cmkcr
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని సెంట్రల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దర్యాప్తునకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. సీబీఐకి గతంలో ఇచ్చిన జనరల్ కన్సెంట్‌ను ఉపసంహరించుకుంది. దీనికి సంబంధించి గతంలో ఇచ్చిన సమ్మతిని ఉపసంహరించుకుంటూ జీవో 51ను ఆగస్టు 30వ తేదీన జారీచేసింది. 
 
తెలంగాణలోకి సీబీఐ ప్రవేశాన్ని అడ్డుకోవాలనే నిర్ణయంపై ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలోనూ ఆలోచనలు చేసునట్టు అధికారిక వర్గాల సమాచారం. దీనిపై సలహాలు, సూచనలు ఆయన స్వీకరించారని చెప్పారు. 
 
ప్రస్తుతం పలు రాష్ట్రాల్లో వివిధ కేసులకు సంబంధించి సీబీఐ అధికారులు విస్తృతంగా దాడులు చేస్తున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో సీబీఐకి గతంలో ఇచ్చిన సాధారణ సమ్మతిని తెలంగాణ ప్రభుత్వం ఉపసంహరించుకోవడం చర్చనీయాంశంగా మారింది.