శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 22 అక్టోబరు 2022 (10:11 IST)

వచ్చే ఎన్నికల్లో వైజాగ్ నుంచి స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా పోటీ చేస్తా: జేడీ లక్ష్మీనారాయణ

Lakshmi Narayana
ఏపీ రాజకీయాల్లో అనూహ్యమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. మొన్నటివరకు బీజేపీతో కలిసి పనిచేసిన జనసేన ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి చేరువయ్యే ఆలోచనలో వుంది. ఇటీవ‌లే చంద్ర‌బాబుతో ప‌వ‌న్ క‌ళ్యాణ్ భేటీ కావడంతో ఇదే ఊహాగానాలు వ‌స్తున్నాయి. 
 
వ‌చ్చే ఎన్నిక‌ల్లో తెలుగుదేశం, జ‌న‌సేన పార్టీలు క‌లిసి ప‌నిచేయ‌బోతున్నాయ‌నే ప్ర‌చారం జోరుగా సాగుతుంది. మ‌రోవైపు తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో జ‌న‌సేన పార్టీ కూడా పోటీ చేయ‌బోతుంది. తెలంగాణ వ్యాప్తంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ యాత్ర‌లు కూడా చేయ‌బోతున్నారు. 
 
గ‌త ఎన్నిక‌ల్లో జ‌న‌సేన పార్టీ త‌ర‌పున పోటీ చేసిన మాజీ సీబీఐ ఆఫీస‌ర్ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ వ‌చ్చే ఎన్నిక‌ల్లో స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా పోటీ చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. 
 
విశాఖ నుంచే ఇండిపెండెంట్ అభ్య‌ర్థిగా పోటీ చేస్తాన‌ని ప్రకటించారు. ఏ పార్టీ నుంచి తాను నిల‌బ‌డ‌బోన‌ని, త‌న సొంత చ‌రిస్మాతోనే పోటీ చేస్తాన‌ని తేల్చి చెప్పేశారు. వైజాగ్ నుంచి తప్పకుండా తాను గెలుపును నమోదు చేసుకుంటానని వెల్లడించారు. ఎన్నికల కోసం ఇంకా రెండేళ్ల సమయం వుందని.. కానీ ఏపీలో ఇప్పుడే ఎన్నికల సందడి మొదలైందని చెప్పారు.