50 నగరాల్లో 5జీ సేవలు.. గుజరాత్‌లో మాత్రం 33 నగరాలకు..?
భారతదేశంలోని 14 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 50 నగరాల్లో 5జీ సేవలను ప్రారంభించినట్లు కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రకటించింది. ముఖ్యంగా గుజరాత్‌లో 33 నగరాలకు 5జీ సేవలు జరుగనున్నాయి. అలాగే మహారాష్ట్ర నుండి 3 నగరాలు, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్ నుండి 2 నగరాలు ఉన్నాయి.
అలాగే, ఢిల్లీ, తమిళనాడు, చెన్నై, కర్ణాటక, తెలంగాణ, రాజస్థాన్, హర్యానా, అస్సాం, కేరళ, బీహార్, ఆంధ్రప్రదేశ్‌లలో ఒక్కొక్క నగరంలో 5Gసేవలు ప్రారంభం అయ్యాయి.
అక్టోబర్ 1న భారతదేశంలో 5Gసేవలు ప్రారంభమయ్యాయి. నవంబర్ 26 నాటికి, 14 రాష్ట్రాలు/యూటీలలోని 50 నగరాల్లో 5Gసేవలు అందుబాటులో ఉన్నాయి. ఎయిర్‌టెల్, జియో 5జీ సేవలను అందిస్తున్నాయి. అలాగే బీఎస్‌ఎన్‌ఎల్‌లో త్వరలో 5జీ సర్వీస్ అందుబాటులోకి రానుందని సమాచారం.