గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 8 డిశెంబరు 2022 (18:57 IST)

టెక్నో పోవా 4 పేరుతో 5జీ కొత్త ఫోన్‌.. ధరెంతో తెలుసా?

Tecno POVA 4
Tecno POVA 4
టెక్నో పోవా 4 పేరుతో కొత్త ఫోన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. దీని ధర రూ.11,999. 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ, మీడియా టెక్ హీలియో జీ 99 చిప్ సెట్, పాంథర్ గేమ్ ఇంజన్ 2.0, హైపర్ ఇంజన్ 2.0 లైట్ (గేమింగ్ కోసం) ఫీచర్లు వున్నాయి. 
 
స్టోరేజీని 2టీబీ వరకు ఎక్స్ పాండ్ చేసుకోవచ్చు.సైరోలైట్ బ్లూ, ఉరానోలిత్ గ్రే, మ్యాగ్మా ఆరెంజ్ రంగుల్లో వస్తుంది. ఈ నెల 13 నుంచి అమెజాన్, జియోమార్ట్‌పై కొనుగోలు చేసుకోవచ్చు.
 
ఫీచర్స్:
6,000 ఎంఏహెచ్ బ్యాటరీ
18 వాట్ ఫాస్ట్ ఛార్జర్ అడాప్టర్
10 వాట్ రివర్స్ ఛార్జ్ సపోర్ట్
50 మెగాపిక్సల్ ప్రధాన కెమెరా
10 ఎక్స్ జూమ్, 
2కే సపోర్ట్ వీడియోలు తీసుకోవచ్చు.