గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 8 నవంబరు 2022 (12:33 IST)

జియో తక్కువ రీఛార్జ్ ప్లాన్స్... 395 రూపాయలతో రీచార్జ్ చేసుకుంటే?

JioFi
రిలయన్స్ జియో తన కస్టమర్లకు బంపర్ ఆఫర్ ఇస్తోంది. తక్కుల రీఛార్జ్ తో ఎక్కువ సమయం వ్యాలిడిటీ కలిగిన రీచార్జ్ ప్యాక్ ను ప్రకటించింది. ఇప్పటికే ఎన్నో ఆఫర్లను ప్రకటించిన జియోలో.. డేటా అవసరం లేకుండా వ్యాలిడిటీ కోరుకునే వారికోసం సరికొత్త ప్యాక్ అందిస్తోంది. 395 రూపాయలతో రీచార్జ్ చేసుకుంటే 84 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది.
 
అయితే, ఇందులో కూడా కొంత డేటా వస్తుంది. అలాగే 1000 వరకు మెసేజ్‌లు ఉచితంగా చేసుకునే అవకాశం ఉంది. దీంతోపాటు.. ఓటీటీ సబ్‌స్క్రిప్షన్స్‌ను కూడా ఫ్రీగా ఇస్తోంది. 666 ప్లాన్ కూడా అదిరిపోయేలా ఉంది. 
 
రూ. 395 ప్రీపెయిడ్ ప్యాక్.. తక్కువ డేటా, ఎక్కువ వ్యాలిడిటీ కావాలనుకునే వారి కోసం ఉద్దేశించబడింది. ఈ ప్యాక్ 84 రోజుల వ్యాలిడిటీ కలిగి, అపరిమిత వాయిస్ కాల్‌లను అందిస్తుంది. అలాగే 6GB డేటా కూడా వస్తుంది. మొత్తం చెల్లుబాటు వ్యవధికి 1000 SMS లభిస్తాయి. ఈ ప్లాన్‌లో అపరిమిత వాయిస్ కాల్స్‌తో పాటు.. జియో యాప్‌లకు కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్‌తో వస్తుంది.