గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 21 మే 2022 (15:34 IST)

మరోమారు బాదుడుకు సంకేతాలు ఇచ్చిన ఎయిర్‌టెల్

airtel
దేశంలోని ప్రైవేట్ టెలికాం కంపెనీల్లో ఒకటైన ఎయిర్‌టెల్ మరోమారు తన కస్టమర్లకు షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతుంది. యూజర్ చార్జీలను 10 నుంచి 20 శాతం మేరకు పెంచాలని భావిస్తుంది. ఈ మేరకు ఆ కంపెనీ సీఈవో గోపాల్ మిట్టల్ సంకేతాలు ఇచ్చారు. 
 
గత యేడాది నవంబరు - డిసెంబరు నెలలో ఈ కంపెనీ భారీగా చార్జీలను పెంచిన విషయం తెల్సిందే. అపుడు ఎయిర్‌టెల్, జియో, వొడాఫోన్ ఐడియా కంపెనీలు 18 నుంచి 25 శాతం మేరకు టారిఫ్‌లను పెంచేశాయి. ఇపుడు మరో విడత పెంపునకు సిద్ధమవుతున్నాయి. 
 
గతంలో పెంచిన పెంపుదలతో ఒక్కో యూజర్ నుంచి ఎయిర్ టెల్ కంపెనీ నెలకు సగటున రూ.178 వరకు ఆదాయాన్ని అర్జిస్తుంది. దీన్ని రూ.200కు తీసుకెళ్లడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఆ కంపెనీ సీఈవో గోపాల్ మిట్టల్ తెలిపారు. అంటే త్వరలోనే ఎయిర్‌టెల్ చార్జీలను పెంచనున్నట్టు స్పష్టమైన సంకేతాలు వెలువరించారు. 
 
ప్రస్తుతం ప్రీపెయిడ్ చార్జీలు చాలా తక్కువగా ఉన్నాయని, వీటి కనీస ధరను రూ.200గా చేర్చాల్సిన అవరం ఎంతైనా ఉందని గోపాల్ మిట్టల్ అన్నారు. అంటే కనీసం 10 నుంచి 20 శాతం మేరకు ధరలు పెంచే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.