శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 17 మే 2022 (19:03 IST)

నకిలీ ఖాతాల లెక్క తేలనిదే ట్విట్టర్ డీల్ ముందుకు సాగదు : ఎలాన్ మస్క్

elon musk
అమెరికా కుబేరుడు ఎలాన్ మస్క్ ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్ కొనుగోలుపై తన మనసులో ఉన్న మాటను వెల్లడించారు. ట్విట్టర్ ఖాతాల్లో ఉన్న నకిలీ ఖాతాల లెక్క తేలనిదే ట్విట్టర్ కొనుగోలుపై ఒప్పందం ముందుకు సాగదని ఆయన తేల్చి చెప్పారు. 
 
ఇదే అంశంపై ఆయన స్పందిస్తూ, ట్విట్టర్‌లో ఉన్న మొత్తం ఖాతాల సంఖ్యలో నకిలీ ఖాతాల సంఖ్య 5 శాతం కంటే తక్కువేని, ట్విట్టర్ నిర్వాహకులు పక్కా ఆధారాలతో చూపిస్తేనే తాను కొనుగోలుకు ముందడుగు వేస్తానని మస్క్ తేల్చి చెప్పారు. ట్విట్టర్ ఎస్ఈసీ ఫైలింగ్స్ ఎంత నిక్కచ్చిగా ఉన్నాయన్న దానిపైనే భవిష్యత్ ఆధారపడివుంటుందని ఆయన వెల్లడించారు. 
 
ఈ ఒప్పందంలో పురోగతి కనిపించాలంటే స్పామ్ ఖాతాలు ఎన్ని ఉన్నాయో తేల్చాల్సిదేనని, ప్రస్తుత ఖాతాల్లో 5 శాతం కంటే తక్కువగా ఉన్నాయని ట్విట్టర్ సీఈవో అనురాగ్ పరాగ్ బహిరంగంగానే వెల్లడించారని ఎలాన్ మస్క్ గుర్తుచేశారు.