మంగళవారం, 18 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 25 ఏప్రియల్ 2022 (22:31 IST)

ఎలన్ మస్క్ బంపర్ ఆఫర్.. డీల్ కుదిరితే ఆయన చేతికి ట్విట్టర్‌?

twitter
సోషల్ మీడియాలో అగ్రగామి అయిన ట్విట్టర్‌కు ఎలన్ మస్క్ 43 బిలియన్ డాలర్లు చెల్లించేందుకు ముందుకొచ్చాడు.  ఇప్పటికే ట్విట్టర్‌లో వాటా కొనుగోలు చేసిన ఎలన్ మస్క్, తాజాగా ఆ సంస్థను పూర్తిగా సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.  అయితే 43 బిలియన్ డాలర్ల డీల్‌కు ట్విట్టర్ నో చెప్పింది. 
 
అయినప్పటికీ చర్చలు కొనసాగుతున్నాయి. తాజాగా ఈ చర్చలు తుది దశకు చేరుకున్నాయని కంపెనీకి చెందిన విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కంపెనీ ప్రస్తుతం కొత్త ప్రతిపాదనతో ముందుకొచ్చే అవకాశం ఉంది. 
 
ఎలన్ మస్క్ ఇస్తానన్న దానికంటే మరింత ఎక్కువ అమౌంట్‌తో ట్విట్టర్ ఎలన్ మస్క్‌కు ప్రతిపాదనలు పంపనుంది. దీనికి మస్క్ అంగీకరిస్తే.. ట్విట్టర్ మస్క్ సొంతం కావడం ఖాయమని నిపుణులు అంచనా వేస్తున్నారు.