గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 13 జూన్ 2022 (10:08 IST)

పేటీఎం ద్వారా మొబైల్ రీఛార్జ్ చేసుకోవాలనుకుంటున్నారా?

PAYTM
ప్రముఖ పేమెంట్స్ యాప్ పేటీఎం వాడుక దారులకు షాకింగ్ న్యూస్. పేటీఎం ద్వారా మొబైల్ రీఛార్జ్ చేసుకోవాలనుకునేవారికి ఇక సర్ ఛార్జ్‌లు తప్పవు. ఎందుకంటే పేటీఎం ఇటీవల రీఛార్జ్‌పై సర్‌ఛార్జ్ వసూలు చేయడం ప్రారంభించింది. 
 
ఈ రుసుము రూ. 1 నుండి రూ. 6 వరకు ఉంటుంది. సర్‌ఛార్జ్ ఎంత అనేది మీరు చేసుకునే రీఛార్జ్ మొత్తంపై ఆధారపడి ఉంటుంది. ఈ ఛార్జీలు అన్ని పేటీఎం మొబైల్ రీఛార్జ్‌లపై వర్తించనుంది. గతేడాది.. ఫోన్‌పే తన కస్టమర్‌లకు రీఛార్జ్‌పై సర్‌ఛార్జ్‌ని అమలు చేసిని విషయం తెలిసిందే. 
 
ఈ విషయంపై ట్విట్టర్‌లో చాలా మంది వినియోగదారులు తమ పోస్టుల ద్వారా అసంతృప్తి వ్యక్తం చేశారు. మార్చి నుంచే పేటీఎం ఈ ఛార్జీలను అమల్లోకి తీసుకురాగా.. ఇప్పుడు పెద్ద సంఖ్యలో వినియోగదారులకు ఛార్జీలు పడుతున్నాయి. 
 
ప్రస్తుతం.. ఈ రుసుము రూ. 100 కంటే ఎక్కువ రీఛార్జ్‌పై కనిపిస్తోంది. 2019 సంవత్సరంలో, పేటీఎం దాని వినియోగదారుల నుండి సర్‌ఛార్జ్ రుసుములను వసూలు చేయదని చెప్పింది.