ఛోట్టోగ్రామ్ టెస్ట్ : బంగ్లాదేశ్ ముంగిట భారీ టార్గెట్
ఛోట్టోగ్రామ్‌లో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తుంది. ఆతిథ్య బంగ్లాదేశ్ జట్టుతో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత్ 513 విజయలక్ష్యాన్ని బంగ్లాదేశ్ ముంగిట ఉంచింది. భారత్ తన రెండో ఇన్నింగ్స్‌ను 2 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. దీంతో బంగ్లాదేశ్ జట్టు 513 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది. శుక్రవారం ఆటకు మూడో రోజు. ఇంకా రెండు రోజుల ఆట ముగిలివుంది. దీంతో ఈ మ్యాచ్ ఫలితం స్పష్టంగా రానుంది.
ఇదిలావుంటే, భారత్ రెండో ఇన్నింగ్స్‌లో భారత జట్టుకు ఇద్దరు ఆటగాళ్లు సెంచరీలు బాదారు. ఓపెనర్ గిల్ 110 పరుగులు చేయగా, పుజారా 102 పరుగులు చేశారు. పూజారా శతకం పూర్తి చేయగానే జట్టు తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశారు. కోహ్లీ 19 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
బంగ్లాదేశ్ ముంగిట టార్గెట్ 500కుపై ఉండటంతో బంగ్లాదేశ్ ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఈ మ్యాచ్‌లో భారత్ విజయం ఖాయంగా కనిపిస్తుంది. ఆటకు మరో రెండు రోజుల సమయం ఉండటంతో బంగ్లాదేశ్ బ్యాటర్లు 200 ఓవర్లు ఆడేది అనుమానమే. అందువల్ల ఫలితం తేలనుంది.