కేప్ టౌన్ ప్రజలకు వార్నింగ్ ఇచ్చిన ప్రకృతి.. ఏప్రిల్ 14, 2027 తర్వాత తాగు నీటి సరఫరా లేదు
Capetown water crisis
1 డిసెంబర్ 2026 నుండి లెవల్ 1 ఆంక్షలు అంటే ఏమిటి.. మార్గదర్శకంగా, నివాసితులు రోజుకు ఒక్కొక్కరు 85 లీటర్ల కంటే ఎక్కువ నీటిని ఉపయోగించకుండా ఉండాలని లక్ష్యంగా పెట్టుకోవాలి. ఇందులో వ్యక్తిగత పరిశుభ్రత, వంట, శుభ్రపరచడం, బట్టలు ఉతకడానికి నీరు ఉంటుంది.
ఆపై సుమారు 10 లక్షల మంది ప్రజల తాగునీటి కనెక్షన్లు కట్ కానున్నాయి. భారతదేశంలో పెట్రోల్ బంకుల్లో ఇంధనం పొందినట్లుగా, కేప్ టౌన్‌లో నీటిని సరఫరా చేసే వాహనాల (ట్యాంకర్ల) ద్వారా ఒక్కొక్కరికి కేవలం 25 లీటర్ల నీరు మాత్రమే ఇవ్వబడుతుంది. అదనపు నీటిని కోరేవారు లేదా నీటిని బలవంతంగా స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించే వారిపై చర్యలు తీసుకోవడానికి పోలీసులు, సైనిక సిబ్బందిని నియమించారు.
ప్రపంచం ఎదుర్కొంటున్న ఈ దుస్థితి ఎవరికైనా రావచ్చు. అందువల్ల, నీటిని చాలా జాగ్రత్తగా, పొదుపుగా వాడాలని అధికారులు చెప్తున్నారు. నీటిని వృధా చేయడం ఆపాలని వారు హితవు పలికారు.
ఇప్పటికే మహారాష్ట్రలోని లాతూర్‌కు రైళ్ల ద్వారా నీటిని తీసుకెళ్లడం మనం ప్రత్యక్ష్యంగా చూసే వున్నాం. ప్రపంచంలో ఉన్న మొత్తం నీటిలో కేవలం 2.7శాతం మాత్రమే తాగడానికి యోగ్యమైనది. అంతేగాకుండా ఈ సంవత్సరం వర్షపాతం సగటు కంటే తక్కువగానే ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ వర్షం, కొన్ని ప్రాంతాల్లో సగటు కంటే తక్కువ వర్షమే నమోదైంది. ముంబైకి నీటిని అందించే సమీపంలోని ఆనకట్టలలో నీటి మట్టం తగ్గడంతో, భూగర్భ జలమట్టం కూడా పడిపోయింది. బాధ్యతగల పౌరులుగా, నీటిని వృథా చేయడం ఆపి, దాన్ని ఆదా చేయాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇందుకోసం ఈ చిట్కాలు పాటిస్తే సరిపోతుంది.
1. కారు లేదా ద్విచక్ర వాహనాలను ప్రతిరోజూ కడగడం మానుకోండి.
2. ఆవరణం, మెట్లు కడగాల్సి వస్తే, చాలా తక్కువ మొత్తంలోనే నీటిని ఉపయోగించండి.
3. కుళాయిని తెరిచి ఉంచి నీటిని వృథా చేయవద్దు.
4. ఇంకా అనేక మంచి మార్గాల్లో నీటిని ఆదా చేయడానికి ప్రయత్నించండి.
5. ఇంట్లో లీక్ అవుతున్న కుళాయిలు ఏవైనా ఉంటే, వెంటనే సరిచేయండి.
6. మొక్కలకు పోసే నీటి పరిమాణాన్ని తగ్గించండి. వీలైతే, ఒక రోజు విడిచి ఒక రోజు మాత్రమే నీరు పోయండి.
7. రోజువారీ వినియోగానికి రెండు జతల దుస్తులు ఉంటే, వాటిని ఒక రోజు విడిచి ఒక రోజు ఉతకండి. వాషింగ్ మెషీన్ ఉపయోగించేటప్పుడు, అవసరానికి మించి నీటిని వాడకుండా చూడండి.
8. వీలైనంత వరకు రోడ్డుపై నీరు చల్లడం మానుకోండి. ఒకవేళ చల్లాల్సిన అవసరం ఏర్పడితే, బట్టలు ఉతికిన నీటిని వాడండి. భవిష్యత్తులో రాబోయే నీటి సంక్షోభాన్ని నివారించడానికి ఇవి తప్పనిసరి. తద్వారా భవిష్యత్ తరాలకు కూడా నీరు అందేలా చేద్దామని అధికారులు కోరుతున్నారు.

