1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
  4. mangalavaram puja to lord hanuman, Tuesday

మంగళవారం హనుమంతుని పూజిస్తే వారి పీడ వదులుతుందట...

హనుమంతుడికి మంగళవారం నాడు చేసే పూజ అంటే ఎంతో ప్రీతికరం. ఆరోజున ఆంజనేయుడిని పూజిస్తే సకల సంపదలు చేకూరుతాయి. స్వామికి సింధూర అభిషేకాలు, ఆకు పూజలు చేయిస్తుంటారు. ఆయనకి ఇష్టమైన వడలు, అప్పాలను నైవేద్యంగా చేయించి సమర్పిస్తుంటారు. ఈవిధంగా చేయడం వలన స్వామి ప

mangalavaram puja
హనుమంతుడికి మంగళవారం నాడు చేసే పూజ అంటే ఎంతో ప్రీతికరం. ఆరోజున ఆంజనేయుడిని పూజిస్తే సకల సంపదలు చేకూరుతాయి. స్వామికి సింధూర అభిషేకాలు, ఆకు పూజలు చేయిస్తుంటారు. ఆయనకి ఇష్టమైన వడలు, అప్పాలను నైవేద్యంగా చేయించి సమర్పిస్తుంటారు. ఈవిధంగా చేయడం వలన స్వామి ప్రీతి చెంది కోరిన వరాలను ప్రసాదిస్తాడని భక్తులు విశ్వసిస్తుంటారు. సాధారణంగా శారీరక మానసిక రుగ్మతలతో బాధపడుతున్నవారు, దుస్వప్నాలతో ఇబ్బందులు పడుతున్నవారు హనుమంతుడికి మంగళవారం పూజ చేస్తే రుగ్మతల నుండి ఉపశమనం లభిస్తుంది. 
 
ఇక నవగ్రహ సంబంధిత దోషాలతో ఇబ్బందిపడేవారు మంగళవారం పూట హనుమంతుడిని పూజిస్తే.. ఆశించిన ఫలితాలు చేకూరుతాయి. ప్రతి మంగళవారం హనుమంతుడికి భక్తిశ్రద్ధలతో ప్రదక్షిణలు చేయడం వలన, పూజాభిషేకాలు జరిపించడం వలన, 'సుందరకాండ' పారాయణ చేయడం వలన, 'హనుమాన్ చాలీసా' చదవడం వలన హనుమంతుడు ప్రీతి చెందుతాడు. ఆయన ప్రభావం వలన ఇటు కుజుడు ... అటు శనిదేవుడు శాంతిస్తారు. అలా మనిషికి వారి ద్వారా పట్టిన పీడ వదులుతుందట.
తర్వాతి కథనం
30-05-2017 రాశి ఫలితాలు... ఆ రాశివారు తోటివారి వల్ల మాట పడక తప్పదు...