శ్రీవారి మహద్వారం ముందుకు దూసుకొచ్చిన కారు... తిరుమలేశా...
తిరుమల శ్రీవారి ఆలయం ఎదుట ఒక ఎరుపు రంగు కారు శుక్రవారం హల్ చల్ చేసింది. మహాద్వారం ముందుకు ఏపీ03ఎజె2619 కారు దూసుకు వచ్చింది. మూడు గేట్లు దాటి ఆలయం వద్దకు వచ్చినా విజిలెన్స్ వారు పట్టించుకోలేదు. ఈ సంఘటనతో విజిలెన్స్ సిబ్బంది వైఫల్యం మరోమారు బయటపడింది.ఆ కారు గురించి విచారించగా మాజీ ట్రస్ట్ బోర్డ్ మెంబర్ దొరస్వామి రాజు వాహనంగా గుర్తించారు.
