1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
  4. Appalayagunta venkateswara brahmotsavas

జూన్‌ 15 నుంచి అప్పలాయగుంట వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు

Appalayagunta venkateswara brahmotsavas
తిరుపతి సమీపంలోని అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయంలో జూన్‌ 15వతేదీ నుంచి 23వతేదీ వరకు జరుగనున్న బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై తితిదే తిరుపతి సంయుక్త కార్యనిర్వహణాధికారి పోలా భాస్కర్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. స్థానిక ఆలయంలో సమావేశమైన జెఈఓ బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు.
 
జెఈఓ మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల్లో భాగంగా జూన్‌ 7వతేదీన కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం, జూన్‌ 14వతేదీన అంకురార్పణ, జూన్‌ 15వతేదీన ధ్వజారోహణం, జూన్‌ 19వతేదీన గరుడసేవ, జూన్‌ 22వతేదీన రథోత్సవం, జూన్‌ 23వతేదీన చక్రస్నానంతను తితిదే నిర్వహించనుంది. అలాగే జూన్‌ 18వతేదీన కళ్యాణోత్సవాన్ని కూడా నిర్వహించనుంది. గరుడ వాహనం రోజు తిరుమల శ్రీవారి ఆలయం నుంచి లక్ష్మీకాసుల హారాన్ని వూరేగింపుగా తీసుకొచ్చి స్వామివారికి అలంకరించి ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు.
తర్వాతి కథనం
ఆన్‌లైన్‌లో శ్రీవారి సేవలను విడుదల చేసిన తితిదే - మొత్తం 56,640 సేవలు