నాకు తెలుగు తెలుసు.. తితిదే ఈఓ... స్వరూపానందకు కౌంటర్(video)
తెలుగు భాషపై తనకు పూర్తిపట్టు ఉందన్నారు నూతన టిటిడి కార్యనిర్వహణాధికారి అనిల్ కుమార్ సింఘాల్. ఎపి క్యాడర్‌లో పనిచేసిన తాను తెలుగు రాయగలనని, తెలుగు చదవగలనని, తెలుగు ఫైళ్ళపై సంతకం పెట్టగలనన్నారాయన. తన ప
తెలుగు భాషపై తనకు పూర్తిపట్టు ఉందన్నారు నూతన టిటిడి కార్యనిర్వహణాధికారి అనిల్ కుమార్ సింఘాల్. ఎపి క్యాడర్‌లో పనిచేసిన తాను తెలుగు రాయగలనని, తెలుగు చదవగలనని, తెలుగు ఫైళ్ళపై సంతకం పెట్టగలనన్నారాయన. తన పోస్టింగ్ పైన మాట్లాడనంటూనే స్వామివారి చెంత ఈఓగా అవకాశం రావడం ఎంతో సంతోషంగా ఉందని తితిదే ఈఓ ఒక టివి ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.
ఉత్తరాదికి చెందిన నూతన ఈఓపై కోర్టుకెళ్ళడానికి స్వరూపానందస్వామి సిద్ధమవ్వడం, పవన్ కళ్యాణ్ ట్వీట్లు చేయడంతో ఈఓ స్పందించిన తీరు ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.