1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
  4. Tiruchanur Sri Padmavati Thayar Brahmotsavam 2016

26 నుంచి తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు

కలియుగ వైకుంఠుని పట్టపురాణి తిరుమల వెంకన్న సతీమణి పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు వచ్చే నెల 26వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. బ్రహ్మోత్సవాలకు తితిదే ఇప్పటికే ఏర్పాట్లను పూర్తి చేసింది. తిరుమల శ్రీవ

Tiruchanur Sri Padmavati Thayar Brahmotsavam 2016
కలియుగ వైకుంఠుని పట్టపురాణి తిరుమల వెంకన్న సతీమణి పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు వచ్చే నెల 26వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. బ్రహ్మోత్సవాలకు తితిదే ఇప్పటికే ఏర్పాట్లను పూర్తి చేసింది. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ముగిసి కొన్ని రోజులు కాకముందే అమ్మవారి బ్రహ్మోత్సవాలు జరుగుతుండటంతో భక్తుల్లో ఆధ్మాత్మిక భావన వెల్లివిరిస్తోంది.
 
బ్రహ్మోత్సవాల్లో భాగంగా నవంబర్‌ 26వ తేదీన ధ్వజారోహణం, రాత్ర చిన్నశేషవాహనం, 27వతేదీ ఉదయం పెద్దశేషవాహనం, రాత్రి హంసవాహనం, 28వతేదీ ఉదయం ముత్యపుపందిరి వామనం, రాత్రి సింహవాహనం, 29వతేదీ ఉదయం కల్పవృక్షవాహనం, రాత్రి హనుమంతవాహనం, 30వతేదీ ఉదయం పల్లకీ ఉత్సవం, రాత్రి గజవాహనం, డిసెంబర్‌ 1వతేదీ ఉదయం సర్వభూపాల వాహనం, రాత్రి గరుడవాహనం, 2వతేదీ ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభవాహనం, 3వతేదీ ఉదయం రథోత్సవం, రాత్రి అశ్వవాహనం, 4వతేదీ ఉదయం పల్లకీ ఉత్సవం, పంచమీతీర్థంలు జరుగనున్నాయి. 
About Writer
ttdj
తర్వాతి కథనం
తిరుమలలో అనంతాళ్వాన్‌ ఎవరు..! శ్రీవారికి అత్యంత ఇష్టమైన వ్యక్తి!