సంబంధిత వార్తలు
- కేసీఆర్ నల్లత్రాచు లాంటోడు : రేవంత్ రెడ్డి
- కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని నాలుక్కోసి హుండీలో వేసిన తూ.గో వాసి
- లగడపాటి సతీమణి మెడలో టీఆర్ఎస్ కండువా...
- పూర్తి మెజార్టీతో కేసీఆర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు : అసదుద్దీన్ జోస్యం
- కేసీఆర్ ఓ కసాయిలా ప్రవర్తించారు.. రైతులూ రుణాలు చెల్లించొద్దు : రేవంత్ రెడ్డి
అధికారంలోకి వచ్చేది మేమే... తెరాస చీఫ్ కేసీఆర్
తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని దీమా వ్యక్తం చేశారు టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్ రావు. తమ స్వగ్రామం చింతమడకలో ఓటు హక్కు వినియోగించుకున్నారు కేసీఆర్ దంపతులు. అనంతరం మీడియాతో మాట్లాడిన కేసీఆర్... రాష్ట్రవ్యాప్తంగా చాలా అనుకూలమైన పవనాలు ఉన్నాయన్నారు.
మేం మొదటి నుంచి చెబుతూనే ఉన్నాం... తొలి నుంచి మంచి వాతావరణమే ఉందన్న ఆయన... మంచి ఫలితాలు రాబోతున్నాయన్నారు. పోలింగ్ శాతం కూడా భారీగా నమోదు కాబోతుందన్న టీఆర్ఎస్ అధినేత... హైదరాబాద్‌లో కూడా మంచి పోలింగ్ శాతం నమోదవుతోందని... ముఖ్యంగా వయోవృద్ధులు అధిక సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారని చెప్పారు.