సంబంధిత వార్తలు
- తెలంగాణ సీఎం... ఈ రోజు కేసీఆర్.. రేపు రేవంత్ రెడ్డి : గులాం నబీ ఆజాద్
- సీఎం కుర్చీపై రేపు రేవంత్ రెడ్డి కూర్చోవచ్చు.. ఆజాద్ షాకింగ్ కామెంట్స్
- ఏపీ ఎన్నికల్లో వేలు పెట్టండి.. ఎవరు వద్దన్నారు.. నారా లోకేష్
- నా బెడ్రూమ్లోకి వచ్చి.. గొర్రెను ఈడ్చుకెళ్లినట్లు లాక్కెళ్లారు.. రేవంత్ రెడ్డి
- ఏ ఆధారాలతో రేవంత్‌ను అరెస్టు చేశారు : హైకోర్టు ప్రశ్న :: ఫైర్‌బ్రాండ్ రిలీజ్‌కు ఈసీ ఆదేశం
కేసీఆర్ ఓ కసాయిలా ప్రవర్తించారు.. రైతులూ రుణాలు చెల్లించొద్దు : రేవంత్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై టీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ప్రజాకూటమి కొడంగల్ అభ్యర్థి రేవంత్ రెడ్డి మరోమారు విరుచుకుపడ్డారు. కేసీఆర్ ఓ కసాయిలా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. అర్థరాత్రి ఇళ్ళలోకి దూరి గొర్రెల్లా లాక్కుపోతున్నారంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరిరోజైన బుధవారం రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గంలో రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ఆపద్దర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఓట్లు ముఖ్యమని.. మన బతుకులు కాదన్నారు. మనం చావు బతుకుల మధ్య ఉన్నప్పటికీ కేసీఆర్ మాత్రం ఓటు వేయాలని చెబుతాడని పేర్కొన్నారు.