సంబంధిత వార్తలు
- లగడపాటిది సర్వే కాదు చిలక జోస్యం : కేటీఆర్ సెటైర్లు
- నా బెడ్రూమ్లోకి వచ్చి.. గొర్రెను ఈడ్చుకెళ్లినట్లు లాక్కెళ్లారు.. రేవంత్ రెడ్డి
- ఆంధ్రా లారీలను సరిహద్దుల్లోనే ఆపేస్తా : సీఎం కేసీఆర్ హెచ్చరిక
- వందమంది కేసీఆర్‌లు వచ్చినా...పాతాళానికి తొక్కేస్తానన్న రేవంత్.. అందుకే అరెస్ట్?
- బట్టేబాజ్ మాటలు చెప్పిండు... ఆంధ్రకు వస్తావా..? దమ్ముంటే రా... బాలకృష్ణ ఛాలెంజ్
ఏపీ ఎన్నికల్లో వేలు పెట్టండి.. ఎవరు వద్దన్నారు.. నారా లోకేష్
ఆంధ్రప్రదేశ్‌కు కేసీఆర్, కేటీఆర్ సహా ఎవరైనా రావొచ్చునని ఏపీ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ ఎన్నికల్లో అనవసరంగా జోక్యం చేసుకున్నారని.. వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో తాము వేలుపెడతామని తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ హెచ్చరించిన నేపథ్యంలో.. నారా లోకేష్ కౌంటరిచ్చారు.
ఏపీలో ప్రజాస్వామ్యం వుందని.. అక్రమ అరెస్టులు, వేధింపులు, రౌడీయిజంలు లేవని చెప్పారు. కావాలనుకుంటే.. కేటీఆర్ ఆంధ్రాలోనూ ఎన్నికల ప్రచారం చేసుకోవచ్చునని ఎద్దేవా చేశారు.
రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని.. ఇలాంటి చర్యలను ప్రజలు ఎన్నటికీ అంగీకరించరన్నారు. డిసెంబర్ 11న వెలువడనున్న ఎన్నికల్లో మహా కూటమి విజయఢంకా మోగిస్తుందని నారా లోకేష్ ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు తెలంగాణ అభివృద్ధిని అడ్డుకున్నారన్న టీఆర్ఎస్ నేతల ఆరోపణలను మంత్రి ఖండించారు. అభివృద్ధి చేపట్టడం చేతకాక కేసీఆర్ సర్కారు తమపై అభాండాలు వేస్తుందన్నారు.