శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2018
Written By
Last Updated : మంగళవారం, 4 డిశెంబరు 2018 (11:51 IST)

ఆంధ్రా లారీలను సరిహద్దుల్లోనే ఆపేస్తా : సీఎం కేసీఆర్ హెచ్చరిక

సింగిల్ లారీ పర్మిట్‌కు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అంగీకరించకుంటే ఆంధ్రా లారీలను తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లోనే ఆపేస్తామని తెలంగాణ రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్చరించారు. ఈనెల 7వ తేదీన జరిగే ఎన్నికల తర్వాత తెరాస అధికారంలోకి రాగానే రెండు రాష్ట్రాల్లో తిరిగే లారీలకు సింగిల్ పర్మిట్ విధానం అమలయ్యేలా ఏపీ సీఎం చంద్రబాబుతో మాట్లాడుతానని చెప్పారు. దీనికి ఆయన సమ్మతిస్తే సరేసరి.. లేకుంటే లారీలను సరిహద్దుల్లోనే ఆపేస్తానని కేసీఆర్ హెచ్చరించారు. 
 
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన సోమవారం కోదాడ, మిర్యాలగూడ, నల్గొండల్లో జరిగిన బహిరంగ సభల్లో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, తాను ప్రజల ఏజెంట్ అన్న విషయం రాహుల్ గాంధీ తెలుసుకోవాలి. బి టీం కాదు. కోదాడలో బలిసిన అభ్యర్థికి బలహీన అభ్యర్థికి పోటీ. అన్నిరకాల పింఛన్లు పెంచుతున్నాం. బంగారు తెలంగాణ ఏర్పాటు చేసి తీరుతామన్నారు. 
 
సాగర్, పాలేరు, కాళేశ్వరం నుంచి కోదాడకు నీళ్లు తెస్తా, ఒక్క ఎకరం కూడా ఆగంకాకుండా కోదాడకు అందిస్తా. బాధ్యత నాది.. కోదాడ టీఆర్ఎస్ ఇంచార్జ్ శశిధర రెడ్డి‌కి సముచిత స్థానం ఇస్తా. హుజూర్ నగర్ అభివృద్ధికి దూరంగా ఉంది. యాదాద్రి ధర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటుతో మిర్యాలగూడ రూపురేఖలు మారిపోతాయి. ఈ ప్రాంత వాసులకు ఉద్యోగాలు వస్తాయి అని హామీలను ఏకరవు పెట్టారు. 
 
అంతేకాదు.. హీందీ నాకు బాగా వస్తుంది. ఎన్నికల తర్వాత ఢిల్లీ వెళ్తా. వాళ్లను చీల్చి చెండాడుతా. కేసీఆర్‌ని ఇక్కడే ఉంచాలని చూస్తున్నారు. రిపోర్ట్‌లన్నీ మళ్ళీ తెరాస అధికారం‌లోకి వస్తుందని తేల్చాయి. వంద శాతం గెలుస్తాం. ఒక్క కేసీఆర్‌ని కొట్టడానికి సిపిఐ, సిపిఎం, టీడీపీ వంటి తోక పార్టీలు కాంగ్రెస్ పార్టీకి అవసరమా అంటూ రాష్ట్రంలో దళితులు బాగు పడితేనే అభివృద్ధి. మధిరకు కావలసిన అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.