గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2018
Written By
Last Updated : మంగళవారం, 4 డిశెంబరు 2018 (10:51 IST)

బట్టేబాజ్‌ మాటలు చెప్పిండు... ఆంధ్రకు వస్తావా..? దమ్ముంటే రా... బాలకృష్ణ ఛాలెంజ్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెరాస అధినేత కేసీఆర్‌పై టీడీపీ నేత, సినీ నటుడు బాలకృష్ణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజా కూటమి అభ్యర్థుల తరపున బాలయ్య పర్యటిస్తున్నారు. ఇందులోభాగంగా మంగళవారం హైదరాబాద్‌లో ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొని సీఎం కేసీఆర్‌పై ధ్వజమెత్తారు. 
 
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపోయిన తర్వాత కూడా తెలుగు ప్రజలంతా అభివృద్ధి చెందాలన్న ఏకైక లక్ష్యంతో ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలంగాణాలో ప్రజాకూటమి తరపున ప్రచారం చేస్తున్నారని గుర్తుచేశారు. 
 
అంతేకాకుండా, హైదరాబాద్ అభివృద్ధిలో చంద్రబాబును ఏ ఒక్కరూ చెరిపేయలేరన్నారు. ఏదో నాలుగు గొర్రెలను తీసుకొచ్చి మేం పీకినాం అంటే కుదరన్నారు. చంద్రబాబు పక్క గల్లీలో, ఢిల్లీలో వేలుపెట్టేవాడు కాదు.. విదేశాల్లో గల్లీ గల్లీ తిరిగి పెట్టుబడులు రాబట్టేవాడు అని చంద్రబాబు నాయుడు అని బాలయ్య గుర్తుచేశారు. 
 
ముఖ్యంగా ఫామ్‌హౌస్‌లో పనుకునేటోడు కానేకాదన్నారు. రోజుకు 18 నుంచి 20 గంటల పాటు శ్రమించే నేత అని అన్నారు. కేసీఆర్‌ది లాటరీ అని.. చంద్రబాబుది హిస్టరీ అని ఆ హిస్టరీని చెరిపేయాలని చూస్తే చెరిపోదన్నారు. గత ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ఎన్నో హామీలు గుప్పించారు. కానీ, వాటిలో ఒక్కటైనా పూర్తిగా అమలు చేశారా అంటూ నిలదీశారు. 
 
ముఖ్యంగా, సచివాలయానికి రాలేక పోయాయని, మహిళలకు మంత్రివర్గంలో స్థానం కల్పించలేదని, యువతకు ఉద్యోగాలు ఇవ్వలేదని, మిగులు బడ్జెట్‌లో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని రూ.2 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టిన మోసగాడినని చెప్పుకుంటారా? ఈ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలకు ఏమని చెప్పుకుంటారు సీఎం కేసీఆర్ అంటూ నిలదీశారు. 
 
పైగా, చంద్రబాబును తెలంగాణ మంత్రి కేటీఆర్ బెదిరిస్తున్నారు. రేపు ఆంధ్రలో జరగబోయే ఎన్నికల్లో వేలు పెడతానంటూ హెచ్చరికలు చేయడాన్ని కూడా బాలయ్య స్వీకరించారు. 'ఆంధ్రకు వస్తావా..? రా.. దమ్ముంటే చూసుకుందాం' అంటూ సవాల్ విసిరారు. అయినప్పటికీ ఈ ఎన్నికల్లోనే ప్రజలు కేసీఆర్‌తో పాటు కేటీఆర్‌కు ప్రజలు గుణపాఠం చెబుతారని బాలకృష్ణ జోస్యం చెప్పారు.