శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By
Last Updated : సోమవారం, 3 డిశెంబరు 2018 (16:36 IST)

కేసీఆర్‌కు జాతకాల పిచ్చి.. అందుకే ముందస్తు ఎన్నికలు-విజయశాంతి

తెలంగాణ ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌పై ఒకప్పటి చెల్లెమ్మ ప్రస్తుత కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ రాములమ్మ విమర్శలు గుప్పించారు. సీఎం కేసీఆర్‌కు వున్న జాతకాల పిచ్చితోనే తెలంగాణ ప్రస్తుతం ముందస్తు ఎన్నికలు వచ్చాయని.. విజయశాంతి ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక కేసీఆర్‌కు కళ్లు నెత్తికెక్కాయని విజయశాంతి విమర్శించారు. 
 
బంగారు తెలంగాణ రావాలంటే.. కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల తర్వాత తెలంగాణలో రాక్షస పాలన అంతమై కాంగ్రెస్ పాలన వస్తుందని జోస్యం చెప్పారు. డిసెంబర్ 11న ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాక తెలంగాణ ప్రజలకు మంచిరోజులు రాబోతున్నాయని వ్యాఖ్యానించారు. డిసెంబర్ 7న జరుగనున్న ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు ప్రజా కూటమికే ఓటు వేస్తారని విజయశాంతి వ్యాఖ్యానించారు. 
 
కరీంనగర్ జిల్లాలోని సుల్తాన్‌పూర్‌ రోడ్ షోలో విజయశాంతి మాట్లాడుతూ.. కేసీఆర్ సర్కారుపై నిప్పులు చెరిగారు. గత నాలుగేళ్లలో ఇచ్చిన హామీని కేసీఆర్ పూర్తి చేయలేదన్నారు. రాష్ట్రంలోని నాలుగు కోట్ల మంచి ప్రజలను ఆయన మోసం చేశారని ఆరోపించారు.