గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2018
Written By
Last Updated : బుధవారం, 5 డిశెంబరు 2018 (09:16 IST)

తెలంగాణ ఎన్నికలు : నేటితో ప్రచారం పరిసమాప్తం

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఎన్నికల ప్రచారానికి బుధవారం సాయంత్రం 5 గంటలతో తెరపడనుంది. దీంతో చివరి రోజైన బుధవారం అన్ని రాజకీయ పార్టీల నేతలు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు. 13 నియోజక వర్గాల్లో సాయంత్రం 4 గంటలకు, మిగతా నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటలకు ప్రచారం పూర్తికానుంది. అలాగే, రాజస్థాన్ రాష్ట్రంలో కూడా ప్రచారం నేటితో ముగియనుంది. 
 
బుధవారం సాయంత్రం నుంచి బహిరంగ సభలు, ఊరేగింపులు, ర్యాలీలు నిర్వహించకూడదు. ఛానెళ్లలో ఒపీనియన్‌ సర్వేలు, ఎన్నికల సంబంధిత కార్యక్రమాలను నిషేధించారు. పోలింగ్‌ జరిగే ప్రాంతంలో వినోద కార్యక్రమాలకు కూడా అనుమతివ్వలేదు. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే రెండేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధిస్తారు. లేదంటే రెండూ విధించొచ్చన్నారు. ఈ నిబంధనలను విధిగా అమలు చేయాలని ఆయా జిల్లాల ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయి. తెలంగాణ, రాజస్థాన్ రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికల పోలింగ్ ఈనెల 7వ తేదీ శుక్రవారం జరుగనుంది.