1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
  4. Boy dies after being hit by school bus

School bus: సైకిల్‌పై రోడ్డుపైకి బాలుడు... స్కూల్ బస్సు టైర్ కిందపడి మృతి (video)

Cycle Boy
Cycle Boy
పిల్లల పట్ల తల్లిదండ్రుల నిర్లక్ష్యం కారణంగా దారుణ ఘటనలు జరుగుతున్నాయి. పిల్లలకు సైకిల్స్ ఇచ్చి రోడ్లపైకి పంపడంలో ఎంత సేఫ్టీ వుంటుందో ఆలోచించట్లేదు. పిల్లలు సైకిళ్లను రోడ్డపై నడపటం తప్పు కాదు కానీ.. రోడ్లు సరిగ్గా లేకపోవడం, అతివేగంగా ఇతర వాహనాలు నడవడం కారణంగా ఏర్పడే ప్రమాదాలతో చిన్నారుల బలైపోతున్న దాఖలాలు ఎన్నో వున్నాయి. రోడ్లు సరిగ్గా లేకపోవడం కారణంగా ఓ బాలుడు దారుణంగా ప్రాణాలు కోల్పోయాడు. మేడ్చల్ జిల్లా జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. 
 
అల్విన్ కాలనీలో ప్రమాదవశాత్తు స్కూల్ బస్సు కిందపడి బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. సీసీటీవీ ఫుటేజ్‌లో ఈ ఘటన రికార్డ్ అయ్యింది. ఆ వీడియోలో పదేళ్ల బాలుడు జయశిత్ చౌహాన్ సైకిల్ తొక్కుతూ కిందపడిపోగా.. అదే సమయంలో బాలుడి పైకి స్కూలు బస్సుకొచ్చింది. 
 
తేరుకునే లోపై స్కూల్ బస్సు మొదటి టైర్ బాలుడిపై ఎక్కిదిగింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాలుడి ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ ఆ బాలుడు అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 
About Writer
సెల్వి
తర్వాతి కథనం
పద్మావతి ఎక్స్‌ప్రెస్‌లో దొంగల బీభత్సం