సంబంధిత వార్తలు
- గూగుల్ మ్యాప్‌పై అతి విశ్వాసం.. రిజర్వాయర్‌లోకి డీసీఎం - ప్రాణాలతో బయటపడిన డ్రైవర్
- భోజిపురాలో తీరని విషాదం - కారు - ట్రక్కు ఢీకొని 8 మంది సజీవదహనం
- కారు నెంబరు ప్లేట్ పైన మోదీ అని రాసుకున్న కామారెడ్డి ఎమ్మెల్యే తెలంగాణ రాష్ట్ర బీజెపి అధ్యక్షుడు కాబోతున్నారా?
- ప్రాణం తీసిన ఫోను... హైదరాబాద్‌లో డెలివరీ బాయ్ మృతి
- తెలంగాణ మహిళలకు శుభవార్త : సోనియా పుట్టిన రోజు కానుక.. ఉచిత బస్సు ప్రయాణం
కామారెడ్డిలోని షాపింగ్ మాల్‌లో అగ్నిప్రమాదం.. రూ.కోట్లలో ఆస్తి నష్టం
తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డిలో ఓ షాపింగ్ మాల్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కోట్లాది రూపాయల విలువ చేసే ఆస్తి నష్టం వాటిల్లింది. కామారెడ్డి పట్టణంలో ఉండే అయ్యప్ప షాపింగ్ మాల్‌లో ఈ ప్రమాదం సంభవించింది. ఇందులోని ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు ఆందోళనకు గురై ప్రాణభీతితో పరుగులు తీశారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపకదళ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. జేసీబీ సాయంతో మాల్ షట్టర్లు తొలగించారు.
మంటలను ఆర్పే పనులు అర్థరాత్రి నుంచి చేపట్టగా గురువారం ఉదయం 7 గంటలకు అదుపులోకి తీసుకున్నారు. మిగతా రెండు అంతస్తుల్లోని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. అయితే, మంటలు భారీగా ఎగిసిపడుతుండటంతో సహాయక చర్యలు ఆటంకంగా మారింది. ఈ ప్రమాదానికి కారణాలు తెలియాల్సివుంది. ఈ ప్రమాదంలో కోట్లాది రూపాయల విలువైన ఆస్తి కాలిబూడిదైందని షాపింగ్ మాల్ నిర్వహాకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
తర్వాతి కథనం
