మంగళవారం, 27 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

భోజిపురాలో తీరని విషాదం - కారు - ట్రక్కు ఢీకొని 8 మంది సజీవదహనం

car accident
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని భోజిపురాలోని తీరని విషాదం నెలకొంది. కారు - ట్రక్కు ఢీకొన్న ఘటనలో చిన్నారి  సహా మొత్తం ఎనిమిది సజీవ దహనమయ్యారు. బాధితులు ఓ వివాహానికి హాజరై వస్తుండగా ఈ శనివారం రాత్రి బరేలి జాతీయ రహదారిపై ఈ ఘటన జరిగింది. ప్రమాదం తర్వాత కారు సెంట్రల్ లాక్ పడిపోవడంతో లోపలున్న వారు తప్పించుకునే మార్గం లేకుండా పోయింది. కారు టైరు పేలిపోవడంతో కారు అదుపుతప్పి అవతలి రోడ్డులో పడి.. ఉత్తరాఖండ్ నుంచి వస్తున్న ట్రక్కును ఢీకొట్టి నుజ్జునుజ్జు అయింది. 
 
పైగా, కారు ట్రక్కు కొంతదూరం ఈడ్చుకెళ్లడంతో మంటలు చెలరేగాయి. అదేసమయంలో కారు డోర్లు లాక్ కావడంతో కారులోని వారంతా తప్పించుకోలేకపోయారు. మంటల్లో అందరూ సజీవదహనమయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని చిన్నారి సహా మొత్తం ఏడుగురి మృతదేహాలను వెలికి తీశారు. బాధితులను గుర్తించి వారి కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.