బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 2 డిశెంబరు 2023 (23:00 IST)

రామమందిరం ప్రారంభోత్సవానికి 6వేల మంది ప్రముఖులు

ayodhya city
ఉత్తర్‌ప్రదేశ్‌‌లోని అయోధ్యలో చేపట్టిన రామమందిరం ప్రారంభోత్సవానికి రంగం సిద్ధమైంది. ఈ మహోత్సవానికి 6,000 మందికి ఆహ్వానాలు అందనున్నాయి. అయోధ్యలో రామాలయానికి ప్రాణప్రతిష్ఠాపన కార్యక్రమానికి మొత్తం 6,000 మంది ప్రముఖులను ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది. 
 
పది రోజుల పాటు జరిగే ప్రతిష్ఠ ఉత్సవాలు వచ్చే ఏడాది జనవరి 16న ప్రారంభమవుతాయి. ఆలయ గర్భగుడిలో రాముని విగ్రహ ప్రతిష్ఠను 2024 జనవరి 22 మధ్యాహ్నం 12.45-1.00 గంటల మధ్య నిర్వహించనున్నట్టు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ ప్రధాన కార్యదర్శి చంపత్‌ రాయ్‌ ఇప్పటికే ప్రకటించారు. 
 
దేశవ్యాప్తంగా ఉన్న పలువురు పూజారులు, సాధువులే కాదు, ప్రధాని మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో సహా అగ్ర రాజకీయ నాయకులు కూడా జనవరి 22న జరిగే వేడుకల్లో పాల్గొననున్నారు.