శనివారం, 21 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్

ఆ జిల్లాలోని ప్రతి రామాలయానికి "ఆదిపురుష్" టిక్కెట్ల పంపిణీ

adipurush movie unit
ప్రభాస్ - కృతి సనన్ జంటగా నటించిన చిత్రం "ఆదిపురుష్". ఈ నెల 16వ తేదీన విడుదల కానుంది. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహించారు. ఇందులో రావణాసురుడుగా సైఫ్ అలీఖాన్ నటించారు. చారిత్రక రామాయణ గాథ ఆధారంగా రూపొందిన చిత్రం. 
 
అయితే, రామాయణ పారాయణ జరిగే ప్రతిచోటా హనుమంతుడు ఉంటాడన్న నమ్మకంతో 'ఆదిపురుష్' ప్రదర్శించే ప్రతి థియేటర్‌లో ఓ సీటును ఖాళీగా ఉంచేందుకు చిత్రం బృదం నిర్ణయం తీసుకుంది.
 
తాజాగా ఈవెంట్స్ ఆర్గనైజింగ్ సంస్థ శ్రేయస్ మీడియా కూడా ఇదే కోవలో మరో నిర్ణయం తీసుకుంది. ఖమ్మం జిల్లాలోని ప్రతి గ్రామంలో ఉండే రామాలయానికి ఉచితంగా 101 టిక్కెట్లను పంపిణీ చేయనున్నట్టు ప్రకటించింది. తమ సొంత డబ్బుతో ఈ టిక్కెట్లను కొనుగోలు చేసి ఇస్తున్నట్టు శ్రేయస్ మీడియా అధినేత శ్రీనివాస్ మీడియాకు వెల్లడించారు.