ఆదివారం, 1 అక్టోబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 9 జూన్ 2023 (18:27 IST)

ఆదిపురుష్‌ పాత్రపై నటి కస్తూరి ఘాటు విమర్శలు

kasturi -parbahs
kasturi -parbahs
ఆదినుంచి ప్రభాస్‌ నటించిన ఆదిపురుష్‌ పై పలు విమర్శలు వస్తూనే వున్నాయి. రాముడు గెటప్‌లో ప్రభాస్‌ను చూసిన తర్వాత చాలామంది నోరు వెళ్ళబెట్టారు. మీసాలున్న రాముడు ఏమిటి? అని మనకు తెలిసిన రాముడు ఇలాగా వుండేదని సోషల్‌మీడియాలో కోడై కూశారు. కానీ సినిమా తీసిన వారు మాత్రం దీనిపై ఎటువంటి సమాధానం ఇవ్వలేదు. ఇటీవలే జరిగిన ప్రీ రిలీజ్‌ వేడుకలో చినజియర్‌ స్వామి కూడా పాత్ర పై వ్యాఖ్యానించలేదు. రాముడు కథ ఈనాటి జనరేషన్‌ తెలియాలి అని మాత్రమే అన్నారు.
 
ఇక సోషల్‌ మీడియా వేదికగా గృహలక్ష్మీ సీరియల్‌ నటి కస్తూరి మాత్రం మరింత ఘాటుగా స్పందించింది. రాముడు పాత్రను చూస్తే కర్ణుడు గుర్తుకువస్తున్నాడు. రాముడు ఎంత సౌమ్యంగా వుంటాడో, అలాంటి పాత్రకు తెలుగులో చాలామందే వున్నారంటూ వ్యాఖ్యానించింది. ఈమెతో ఏకీభవిస్తూ పలువురు నెటిజన్లు కామెంట్లు కూడా చేశారు. ఇక ఫ్యాన్స్‌ ఏదోవిధంగా స్పందిస్తుంటారుకానీ సినిమా టీమ్‌ ఇంతవరకు స్పందించకపోవడం విశేషం. ఈనెల 16న ఆదిపురుష్‌ విడుదలకాబోతుంది.