1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 13 డిశెంబరు 2023 (22:16 IST)

'ఆడుదాం ఆంధ్రా' ఆటలో జగన్ ఒకవైపు రోజా ఇంకోవైపు ఆటాడుతారేమో?: అయ్యన్నపాత్రుడు సెటైర్లు

ayyannapatrudu
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు అయ్యన్నపాత్రుడు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై విమర్శల వర్షం కురిపించారు. ఇంట్లో ఊడ్చుకునే చెత్తపైన పన్ను వేసి వసూలు చేయడమే కాకుండా రాష్ట్రాన్ని మొత్తం చెత్తచెత్త చేసారని అన్నారు. రైతు భూమి పట్టాదారు పాసుపుస్తకాలపై జగన్ బొమ్మ ఎందుకు అని ప్రశ్నించారు.

పూర్వీకుల ద్వారా సంక్రమించిన ఆస్తికి చెందిన పుస్తకాలపై జగన్ బొమ్మ ఎందుకు వేస్తున్నారో చెప్పాలంటూ ప్రశ్నించారు. రోడ్డు గుంతలు పూడ్చేందుకు డబ్బు లేదు కానీ ఆడుదాం ఆంధ్రా కోసం 100 కోట్లు ఖర్చు పెట్టేందుకు డబ్బులుంటాయన్నారు. ఈ ఆడుదాం ఆంధ్ర ఆటలో సీఎం జగన్ ఒక పక్క రోజా ఇంకోపక్క ఆటాడుతారేమోనంటూ ఎద్దేవా చేసారు.