మంగళవారం, 3 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 3 డిశెంబరు 2024 (12:31 IST)

చాక్లెట్ ఆశ చూపి ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం...

rape
హైదరాబాద్ నగరంలో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఐదేళ్ల చిన్నారిపై లైంగిక దాడి జరిగింది. చాక్లెట్ ఆశ చూపి చిన్నారిని తన వశం చేసుకున్న పరమేశ్ (30) అనే వ్యక్తి ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఘటనలో బాధిత చిన్నారి ఏడుస్తూ ఇంటికి చేరుకోగా, ఆమెకు రక్తస్రావం జరుగుతుండటం గమనించిన కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
 
చిన్నారి ఏమి జరిగింది అని తెలుసుకుని వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. అనంతరం కుటుంబ సభ్యులు జవహర్‌నగర్ పోలీసులను ఆశ్రయించారు. జరిగిన విషయం చెప్పడంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగి చిన్నారి వివరాల ఆధారంగా పరమేశ్‌ను అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడిపై పీడీ యాక్ట్ కింద కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.