సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 2 డిశెంబరు 2024 (22:52 IST)

నారాయణ కాలేజీలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. పరిగెత్తించి లెక్చరర్‌పై దాడి.. (video)

Student
Student
మేడ్చల్ జిల్లా అన్నోజిగూడలోని నారాయణ కాలేజీలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. లెక్చరర్ వేధింపుల కారణంగా ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడని తల్లిదండ్రులు ఆరోపించారు. వివరాల్లోకి వెళితే... అన్నోజిగూడలోని నారాయణ కాలేజీలో ఇంటర్ విద్యార్థి సోమవారం సాయంత్రం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న తనుష్ నాయక్ (16) బాత్రూంలో ఉరి వేసుకుని మృతి చెందాడు. 
విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, బంధువులు అక్కడికి చేరుకుని ఆందోళనకు దిగారు. పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 
ఈ ఘటనతో పేరెంట్స్, బంధువుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కాలేజీకి వెళ్లి గేట్ తాళం విరగ్గొట్టి మరీ లోపలికి వెళ్లి ఆందోళన చేశారు. మీ వేధింపుల వల్లే మా బిడ్డ ఆత్మహత్య చేసుకున్నాడంటూ ప్రిన్సిపాల్‌ను పరిగెత్తించి కొట్టారు. ఈ క్రమంలో ఉద్రిక్త పరిస్థితి తలెత్తగా.. పోలీసులు వారిని అడ్డుకుని ప్రిన్సిపాల్‌ను విడిపించారు.