బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 23 నవంబరు 2024 (17:13 IST)

ఇంజనీరింగ్ విద్యార్థికి ఆ కాల్.. షాకైయ్యాడు.. తర్వాత ఏం జరిగిందేంటంటే?

Call
ఆదిలాబాద్‌లో ఓ మహిళ ఇంజనీరింగ్ విద్యార్థికి న్యూడ్ కాల్ చేసింది. అంతే ఆ విద్యార్థి షాక్ అయ్యాడు. వివరాల్లోకి వెళితే.. ఆదిలాబాద్ సంజయ్‌నగర్‌కు చెందిన ఓ విద్యార్థి ఘట్‌‌‌కేసర్‌లోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్నారు. అలాగే మల్లమ్మకాలనీలో అద్దెకు వుంటున్నాడు. ఇతనికి గురువారం రాత్రి దీక్షికా అగర్వాల్ పేరిట ఓ వీడియో కాల్ వచ్చింది. ఆ వీడియోలో కాల్‌లో వచ్చిన మహిళ ఎలా వున్నారని బాగోగులు అడిగింది. 
 
అన్నింటికి ఆ విద్యార్థి సమాధానం చెప్పాడు. ఉన్నట్టుండి హఠాత్తుగా నగ్నంగా మారింది. ఆ వీడియోను రికార్డ్ చేసింది. కొన్ని నిమిషాల తర్వాత విద్యార్థికి నగ్నంగా ఉన్న వీడియోను పంపి డబ్బులు డిమాండ్ చేసింది. ఇవ్వకపోతే కుటుంబ సభ్యులకు, స్నేహితులకు పంపిస్తానని.. బెదిరించింది. మూడు విడతలుగా రూ.20వేలు ఆన్‌లైన్‌లో పంపించాడు. 
 
మరిన్ని డబ్బులు పంపించాలని బెదిరించడంతో భయపడిపోయిన విద్యార్థి పోచారం ఐటీ కారిడార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.