సంబంధిత వార్తలు
- ఆస్పత్రి బెడ్‌పై భర్త మృతి - గర్భిణి భార్యతో బెడ్ కడిగించిన వైద్యులు (Video)
- అమ్మాయితో టీడీపీ నేత రాసలీలలు - Video Viral
- తనను కాటేసిన పామును మెడలో వేసుకుని ఆసుపత్రికి వచ్చిన వ్యక్తి (Video)
- వెంట్రుకవాసిలో చావు తప్పడమంటే ఇదేనేమో... (Video Viral)
- ఆత్మహత్య కోసం పట్టాలపై పడుకున్న బాలిక.. రైలు ఎంతకీ రాకపోవడంతో నిద్రలోకి (Video)
కారు యజమానిని వణికించిన కాకులు - వీడియో వైరల్
ఓ కారు యజమానికి అనేక కాకులు వణికించాయి. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనికి కారణం లేకపోలేదు. కాకి ఒకటి ఓ కారుపై వాలింది. యజమాని వచ్చి కాకే కదా.. హుష్ అంటే పోతుందని భావించాడు. కానీ, కారుపై అలాగే ఉండిపోయింది. చేతిలో నెట్టివేయాలని చూశాడు. కానీ, కాకి మాత్రం అక్కడ నుంచి కదల్లేదు. ఇలా కాదని దగ్గరగా వెళ్లి కాకిని చేతిలోకి తీసుకుని ఓ పక్కకు విసిరేద్దామనుకున్నాడు.
కానీ కాకిని అలా చేతిలోకి తీసుకోగానే... చుట్టుపక్కల ఉన్న మరికొన్ని కాకులు వేగంగా దూసుకొచ్చాయి. ఆ కారు యజమానిని కాళ్లతో తన్ని ఎగిరిపోవడం మొదలుపెట్టాయి. ఇదేమిటని అతడు భయంగా చూస్తుంటే... పక్కనే ఉన్న చెట్టు కొమ్మపై వాలి, మళ్లీ మళ్లీ దాడి చేయడానికి ప్రయత్నించాయి. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ వీడియోకో లక్షల్లో వ్యూస్ వచ్చాయి. వేల కొద్దీ లైకులు కూడా వచ్చాయి.
Removing a crow from the roof of your car.. what could go wrong? pic.twitter.com/3ifznhH9wZ
— Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) November 21, 2024
