ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 11 సెప్టెంబరు 2024 (11:11 IST)

ఆత్మహత్య కోసం పట్టాలపై పడుకున్న బాలిక.. రైలు ఎంతకీ రాకపోవడంతో నిద్రలోకి (Video)

girl asleep on track
ఆత్మహత్య చేసుకునేందుకు ఓ యువతి రైలు పట్టాలపై పడుకుంది. అయితే, రైలు ఎంతకీ రాకపోవడంతో పట్టాలపై గుర్రుపెట్టి నిద్రపోయింది. కానీ రైలు పట్టాలపై అనుమానాస్పద వస్తువేదో కనిపించడంతో లోకోపైలెట్ అత్యవసర బ్రేక్ సాయంతో రైలను నిలిపివేశారు. ఈ రైలు సరిగ్గా ఆమె తలవద్దకు వచ్చి ఆగింది. లోకోపైలెట్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో ఆ యువతి ఆత్మహత్యాయత్నం విఫలమైంది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఘటన బీహార్ రాష్ట్రంలోని చకియా రైల్వే స్టేషన్ సమీపంలో జరిగింది. 
 
రైలు పట్టాలపై పడి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్న ఓ యువతి ట్రాక్ మధ్యలో కూర్చొంది. ట్రైన్ ఎంతకీ రాకపోవడంతో సిమెంట్ స్లీపర్‌లపైనే పడుకుని నిద్రపోయింది. అయితే, పట్టాల మధ్య అనుమానాస్పద వస్తువేదో కనిపించడంతో అప్రమత్తమైన లోకోపైలెట్ ఎమర్జెన్సీ బ్రేక్ వేయడంతో పెను ప్రమాదం తప్పింది. రైలు సరిగ్గా ఆమె తల వద్దకు వచ్చి ఆగింది. ఆపై కిందకి దిగిన పైలెట్ పట్టాల మధ్య నిద్రపోతున్న అమ్మాయిని చూసి ఆశ్చర్యపోయారు. ఆమెను తట్టిలేపారు. ఏం జరుగుతుందో అర్థంకాని ఆమె ఏడుపు మొదలుపెట్టింది. ఆపై అక్కడే ఉన్న మహిళలతో ఆమెను బలవంతంగా పట్టాలపై నుంచి లాక్కొచ్చారు. తాను రానని ఆ యువతి మొండికేసింది. ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.