బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 22 నవంబరు 2024 (14:42 IST)

ప్రభాస్‌తో అక్రమ సంబంధం అంటగట్టింది మీరు కాదా జగన్ రెడ్డీ? వైస్ షర్మిల (Video)

Sharmila
ప్రభాస్ అనేవాడు ఎవడో తనకు తెలియదని, అలాంటి వ్యక్తితో తనకు అక్రమ సంబంధం అంటగట్టింది వైకాపా జగన్మోహన్ రెడ్డి కాదా అని ఏపీ పీసీసీ చీప్ వైఎస్ షర్మిల మండిపడ్డారు. ఈ అంశంపై స్పందిస్తూ, తాను ప్రభాస్‌ను ఇంతవరకు చూడలేదన్నారు. నా బిడ్డల మీద ప్రమాణం వేసి చెప్తున్న ఆయనతో నాకు ఎలాంటి సంబంధం లేదన్నారు. సిగ్గు లేదా జగన్? గత ఐదేళ్లుగా తన సైతాన్ సైన్యంతో తనకు ప్రభాస్‌కి సంబంధం ఉంది అని ప్రచారం చేయించింది నువ్వేగా జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఇంత నీచుడా నువ్వు అంటూ మండిపడ్డారు. 
 
ఐదేళ్ల క్రితం తనపై ఫేక్ ప్రచారం జరిగితే చర్యలు తీసుకోకుండా జగన్ గాడిదలు కాశారా? బాలకృష్ణ ఇంటి నుంచే తనపై తప్పుడు ప్రచారం జరిగింది అంటున్నారు. ఐదేళ్లు అధికారంలో ఉంది మీరే కదా దానిపై ఎందుకు ఎంక్వయిరీ వేయలేదు? ఈరోజు చెల్లి మీద ప్రేమ ఉన్నట్లు మాట్లాడుతున్నారు. తన వీడియో ఏదో చూపించి జగన్ రాజకీయ మైలేజ్ పొందాలని చూస్తున్నారని తెలిపారు. తాను జగన్ తప్పులను ఎత్తి చూపకపోతే, నా ఆస్థి నాకు ఇస్తానని అంటున్నానని వెల్లడించారు. 
 
కానీ తాను మాట్లాడకుండా ఉండలేననీ, తాను కాంగ్రెస్ పార్టీ చీఫ్, ఇలాంటివి తాను మాట్లాడుకుంటే ఎలా? జగన్మోహన్ రెడ్డికి లంచాలు ఇస్తే, ఆంధ్ర రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టడానికి సిద్ధం అని అన్నారు. కడప వైకాపా ఎంపీ అవినాష్ రెడ్డి, సజ్జల భార్గవ్‌లపై పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు. రేవంత్ రెడ్డి, అదానీ‌ని బ్లాక్‍‌లిస్ట్‌లో పెట్టాలి అని అన్నారు. ఒక సహచరిగా సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నానని, అదానీ‌తో బిజినెస్ చేయొద్దని తెలిపారు.