బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 23 నవంబరు 2024 (11:55 IST)

#DuvvadaMaduriSrinivasLove: ప్రేమ గుడ్డిది కాదు.. ప్రేమను కళ్లారా చూడవచ్చు.. (video)

Duvvada Srinivas
Duvvada Srinivas
దువ్వాడ శ్రీనివాస్ దివ్వెల మాధురిల సంబంధం పైన దువ్వాడ శ్రీనివాస్ సతీమణి దువ్వాడ వాణి చేసిన సంచలన ఆరోపణలు ఆయన ఇంటి వద్ద కొనసాగిన హైడ్రామా తర్వాత విషయం మరింత పబ్లిక్ అయింది. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వీరిపైన పెద్ద ఎత్తున చర్చే జరుగుతుంది. సమాజాన్ని పట్టించుకోకుండా ఈ జంట చేస్తున్న పనులపై జనాలు అవాక్కవుతున్నారు. 
 
ఇటీవల దువ్వాడ శ్రీనివాస్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. బర్త్ డే కానుకగా దువ్వాడ శ్రీనివాస్‌కు దివ్వల మాధురి ఇచ్చిన వాచ్ ఖరీదు 2లక్షల వరకు ఉంటుందని నెటిజన్లు భావిస్తున్నారు. ప్రస్తుతం సహజీవనం చేస్తున్నామని చెబుతున్న ఈ జంట త్వరలోనే పెళ్లి చేసుకుంటామని కూడా ప్రకటన చేసింది. 
 
మరొక పోస్టులో దువ్వాడ శ్రీనివాస్‌తో కలిసి దివ్వల మాదిరి నాగుల చవితి పూజలు చేశారు. ఓ పుట్ట వద్దకు వెళ్లి పుట్టను పసుపు కుంకుమలతో అలంకరించి పూజలు చేశారు. ఈ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 
 
తాజాగా మరో వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో దువ్వాడ, మాధురీలు చక్కగా బైకుపై షికార్లు కొడుతూ కనిపించారు. ఇంకా కోట్ డ్రెస్సులో దువ్వాడ.. తెలుపు చీరలో మాధురీ పెళ్లికి సిద్ధమై నడిచారు. 
Madhuri _Srinivas
Madhuri _Srinivas
 
ఈ వీడియోపై ఓ వైపు ట్రోల్స్ వెల్లువెత్తుతున్నాయి. అయితే 60 సంవత్సరాల వయస్సులో గర్ల్ ఫ్రెండ్‌ని పొందడం కష్టమని.. ఈ ప్రేమను అంగీకరించాల్సిందే అంటున్నారు మరికొందరు. అలాగే ప్రేమ గుడ్డిది కాదు.. వారి ప్రేమను కళ్లారా చూడవచ్చునని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ కామెంట్లు నెట్టింట వైరల్ అవుతోంది.