ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 4 నవంబరు 2024 (17:15 IST)

మొన్న దీపావళి పండుగ.. నేడు పుట్టినరోజు.. దువ్వాడకు మాధురి సూపర్ గిఫ్ట్ (Video)

Duvvada Srinivas
Duvvada Srinivas
ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ జంట దీపావళి కలిసి సెలెబ్రేషన్స్ చేసిన వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఇక తాజాగా దువ్వాడ శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా బర్త్‌డే వేడుకలు ఆయన అనుచరులు, సన్నిహితులు ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. 
 
దివ్వెల మాధురితో కలిసి దువ్వాడ శ్రీనివాస్ పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. దువ్వాడకు ఈ సందర్భంగా మాధురీ ఖరీదైన వాచ్‌ను పుట్టినరోజు కానుకగా అందజేశారు. ఈ  వాచ్ ఖరీదు సుమారుగా రూ.2 లక్షలు వరకూ ఉండొచ్చని తెలిసింది.
 
దివ్వెల మాధురి తిరుమలలో ఫోటోలు దిగడం వివాదాస్పదమైంది. తిరుమలలో రీల్స్ చేయడంతో వీరిపై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ఇక ఈ జంట త్వరలో వివాహం చేసుకోనుందని.. విడాకుల వ్యవహారంలో కోర్టు పరిధిలో వుండటంతో వీరి పెళ్లి లేటు అవుతుందనే విషయం ఇప్పటికే మాధురి కామెంట్లతో స్పష్టమైంది.