సోమవారం, 6 జనవరి 2025
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 3 డిశెంబరు 2024 (08:23 IST)

పెళ్లి పీటలెక్కనున్న పీవీ సింధు.. వరుడు ఎవరంటే..?

pv sindhu
ప్రముఖ బ్యాట్మింటన్ క్రీడాకారిణి, తెలుగమ్మాయి పీవీ సింధు ఓ ఇంటికి కోడలు కాబోతున్నారు. ఈ నెల 22వ తేదీన ఆమె వివాహం చేసుకోనున్నారు. హైదరాబాద్ నగరానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్తను ఆమె వివాహమాడనున్నారు. పేరు వెంకటదత్త సాయి. వీరిద్దరి వివాహం రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయ్‌పూర్‌లో అంగరంగ వైభవంగా జరుగనుంది. 22వ తేదీన వివాహం జరిగిన తర్వాత 24వ తేదీన హైదరాబాద్ నగరంలో వెడ్డింగ్ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు. ఈ వార్తలను ఆమె తండ్రి కూడా ధృవీకరించారు. 
 
వరుసగా రెండు ఒలింపిక్స్ పతకాలు సాధించిన తొలి క్రీడాకారిణిగా రికార్డు సృష్టించిన పీవీ సింధు.. గత రెండేళ్ళుగా అంతర్జాతీయ టైటిల్ కోసం కోసం ఎదురు చూస్తుంది. ఈ క్రమలో తాజాగా జరిగిన సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో సూపర్ 300 టోర్నీ ఫైనల్లో చైనా క్రీడాకారిమి వులుయో యును వరుస సెట్లలో చిత్తు చేసింది.
 
ఇదిలావుంటే, పీవీ సింధుకు ఈ నెల 22వ తేదీన పెళ్లి చేయనున్నట్టు ఆమె తండ్రి పీవీ రమణ వెల్లడించారు. హైదరాబాద్ నగరానికి చెందిన వ్యాపారవేత్త వెంకటదత్త సాయితో వివాహం ఖరారైందని, ఈ నెల 22వ తేదీన రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయ్‌పూర్‌లో వీరి వివాహం జరుగుతుందని, 24వ తేదీన హైదరాబాద్ నగరంలో రిసెప్షన్ ఉంటుందని వివరించారు. పెళ్లి పనులు ఈ నెల 20వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని వెల్లడించారు. 
 
జనవరి నుంచి పీవీ సింధు షెడ్యూల్ బిజీగా ఉండటంతో ఈ నెలలోనే వివాహం చేయాలని నిర్ణయించామని, వరుడు కుటుంబం తమకు చాలా కాలంగా తెలుసునని ఆయన పేర్కొన్నారు. ఇక సింధు వివాహం చేసుకోబోయే వెంకటదత్త సాయి పోసిడెక్స్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టరుగా వ్యవహరిస్తున్నారు.