శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 29 నవంబరు 2024 (12:42 IST)

మా పెళ్లి వచ్చే నెలలో గోవాలో జరుగుతుంది : కీర్తి సురేష్ (Video)

keerti suresh
హీరోయిన్ కీర్తి సురేష్ తన తల్లిదండ్రులతో కలిసి శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. శుక్రవారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనంలో ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి చేరుకున్న నటికి అధికారులు స్వాగతంపలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఆ తర్వాత రంగనాయకుల మండపంలో శేష వస్త్రంతో సత్కరించారు. స్వామివారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. కీర్తి సురేష్ త్వరలోనే వివాహం చేసుకోనున్న విషయం తెల్సిందే. 
 
ఆ తర్వాత ఆమె మీడియాతో మాట్లాడుతూ, తాను నటించిన "బేబీజాన్" హిందీ చిత్రం విడుదలకానుందని, ఆ తర్వాత వచ్చే నెలలో తన పెళ్లి జరుగనుందని, అందుకే కలియుగ దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శనం చేసుకుని ఆశీస్సులు పొందేందుకు వచ్చినట్టు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 
 
కాగా, తన పెళ్లిపై కీర్తి సురేష్ అధికారిక ప్రకటన చేసిన విషయం తెల్సిందే. ప్రియుడు ఆంటోనీతో దీపావళి పండుగ సందర్భంగా తీసుకున్న ఓ ఫోటోను తన ఇన్‌‍స్టాలో షేర్ చేశారు. తమ స్నేహబంధం జీవితాంతం కొనసాగనుందని తెలిపారు. ఈ వార్త తెలుసుకున్న పలువురు సినీ సెలెబ్రిటీలు కీర్తి సురేష్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. కాగా, వీరిద్దరూ వచ్చేనెల వివాహ బంధంతో ఒక్కటికానున్నారు. డిసెంబరు 11, 12వ తేదీల్లో గోవాలో జరుగనుంది.