సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 28 నవంబరు 2024 (17:50 IST)

వివాహేతర సంబంధం: పెళ్లయ్యాక మరొక వ్యక్తితో ఇష్టపూర్వక శృంగారం తప్పు కాదు కానీ...

supreme court
వివాహేతర సంబంధాలపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. పెళ్లి చేసుకున్నాక మరొక వ్యక్తితో ఇష్టపూర్వక శృంగారంలో పాల్గొనడం తప్పు కాదు కానీ సుదీర్ఘ కాలం పాటు శృంగారం చేసాక ఏవో విభేదాల కారణంగా విడిపోయిన మహిళలు పురుషులపై అత్యాచారం కేసులు పెట్టడంపై కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.

పెళ్లయ్యాక మరో వ్యక్తితో శృంగారంలో పాల్గొనేవారు సదరు వ్యక్తిని పెళ్లి చేసుకుంటారన్న హామీతోనే అలా చేస్తారన్నది ఖచ్చితంగా చెప్పలేమని ధర్మాసనం అభిప్రాయపడింది. మహారాష్ట్రలోని ముంబై నగరంలో ఖర్గాన్ స్టేషనులో ఏడు సంవత్సరాల క్రితం ఓ వివాహితుడిపై వితంతువు పెట్టిన అత్యాచారం కేసుకు సంబంధించి విచారణ చేసిన ధర్మాసనం పై వ్యాఖ్యలు చేసింది. పరస్పర వాదోపవాదాల తర్వాత ఆ కేసును కోర్టు కొట్టివేసింది.