1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
  4. Hyderabad: Class 10th Student Allegedly Assaulted by Classmates at School Hostel

శ్రీ చైతన్య హైస్కూల్ హాస్టల్‌లో ర్యాంగింగ్.. కర్రలు, ప్లేట్లు, బూట్లతో విద్యార్థిపై దాడి

crime scene
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని దమ్మాయిగూడెంలో ఉన్న శ్రీ చైతన్య హైస్కూల్ హాస్టల్‌లో, పదవ తరగతి విద్యార్థి ఒకరిపై తోటి విద్యార్థుల బృందం దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అభిషేక్ అనే విద్యార్థిని 10-12 మంది తోటి విద్యార్థులు కర్రలు, ప్లేట్లు, బూట్లతో కొట్టారు. ఈ ఘటన హాస్టల్‌లోనే జరిగినట్లు తెలుస్తోంది. అభిషేక్ మెట్లపై నుంచి కింద పడిపోయాడని పాఠశాల యాజమాన్యం అతని తల్లిదండ్రులకు తెలిపినట్లు సమాచారం. 
 
అయితే, ర్యాగింగ్ పేరుతో తోటి విద్యార్థులు తనపై దాడి చేశారని ఆ విద్యార్థి తర్వాత తన తల్లిదండ్రులకు చెప్పాడు. ప్రస్తుతం అభిషేక్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. 
 
ఈ ఘటనపై అతని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసి, దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఘటనకు బాధ్యులైన విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడంతో పాటు, ఈ విషయాన్ని దాచిపెట్టినందుకు పాఠశాల యాజమాన్యాన్ని కూడా వారు ప్రశ్నించారు.
About Writer
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... మరింత చదవండి
తర్వాతి కథనం
Chennai: పోర్షే కారును ఢీకొన్న క్యాబ్- ఏఆర్ రెహ్మాన్ కుమారుడికి స్వల్ప గాయాలు