హైదరాబాదులో 35 కిలోమీటర్ల మేల డ్రైవర్లు లేని రవాణా విధానం
Driverless Elevated Transport Network
ప్రతిపాదిత ఈ నెట్‌వర్క్ మొదటి దశ, రాయదుర్గం, బయోడైవర్సిటీ జంక్షన్ మీదుగా కూకట్‌పల్లిని నాలెడ్జ్ సిటీతో కలుపుతుంది. ఈ మార్గంలో 64 స్టేషన్లను ఏర్పాటు చేయాలని ప్రణాళిక వేస్తున్నారు. హైదరాబాద్ ప్రజా రవాణా వ్యవస్థ ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణికులకు సేవలు అందిస్తున్న తరుణంలో ఈ ప్రతిపాదన వచ్చింది.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్సార్టీసీ) గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రతిరోజూ సుమారు 30 లక్షల మంది ప్రయాణికులను రవాణా చేస్తుండగా, హైదరాబాద్ మెట్రో ప్రతిరోజూ దాదాపు 4.5-5 లక్షల ప్రయాణాలను నిర్వహిస్తోంది.
తాజాగా ప్రభుత్వ విస్తృత పట్టణ మొబిలిటీ ప్రణాళికలో భాగంగా, మెట్రో రైలు, ఆర్టీసీ బస్సులు, ఇతర రవాణా సేవలను అనుసంధానిస్తూ, ఈ ప్రతిపాదిత పీఆర్టీ నెట్‌వర్క్‌ను ఒక అదనపు రవాణా విధానంగా ప్రణాళిక చేస్తున్నారు.

