తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన ఉల్లి ధరలు- హైదరాబాద్ మార్కెట్‌లో 116.22 శాతం మేర పెంపు
ఉల్లి ధరలు తెలుగు రాష్ట్రాల్లో పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్‌లో ఉల్లి ధర ఏకంగా 116.22 శాతం మేర ఎగబాకింది. ఇదే సమయంలో వెల్లుల్లి ధర 60.74 శాతం, అల్లం ధర 48.32 శాతం పెరగడం వినియోగదారులకు పెద్ద షాక్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లోనూ దాదాపు ఇదే తరహా ధరల పెరుగుదల కనిపిస్తోంది.
కొందరు వ్యాపారులు మార్కెట్‌లో కృత్రిమ కొరతను సృష్టించి, అధిక లాభాల కోసం సరుకులను ఎక్కువ ధరలకు అమ్ముతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అలాగే తదుపరి పంట డిసెంబర్ మధ్యలో చేతికి వచ్చే అవకాశం ఉంది. అప్పటివరకు ఉల్లిపాయల ధరలు తగ్గే పరిస్థితి లేదని వ్యాపారులు అంచనా వేస్తున్నారు.
ప్రస్తుతం హోల్‌సేల్ మార్కెట్‌లో కిలో రూ.60కి విక్రయిస్తున్నారు. దీపావళి తర్వాత మహారాష్ట్రలో కోతలు వేగవంతం కావడంతో వారం రోజుల్లో అక్కడి నుంచి కొత్త సరఫరా మార్కెట్లకు చేరనుంది.
ఇక వెల్లుల్లి ధరలు సైతం భారీగా పెరిగాయి. నాణ్యమైన వెల్లుల్లి హోల్‌సేల్ మార్కెట్‌లో కిలో రూ.300 పలుకుతోంది. ఉల్లి, వెల్లుల్లి ధరల పెరుగుదలతో సామాన్యుల వంటింటి బడ్జెట్‌పై భారం పెరుగుతోంది.

